వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాపై భారత సంతతికి చెందిన దినేష్ శర్మ రచించిన పుస్తకం 2012 సంవత్సరానికి అమెరికన్ లైబ్రరీ అసోసియేషన్ విభాగం బుక్‌లిస్ట్ ఆన్‌లైన్ రూపొందించిన ‘బ్లాక్ హిస్టరీ నాన్‌ఫిక్షన్’ కేటగిరిలో టాప్ 10 జాబితాలో నిలిచింది. ‘బరాక్ ఒబామా ఇన్ హవాయి అండ్ ఇండోనేషియా’ పుస్తకాన్ని న్యూయార్క్ చెందిన మానవ పరిణామ శాస్త్రజ్ఞుడు (ఆంత్రోపాలజిస్ట్) దినేష్ శర్మ రచించారు....
సిలికానాంధ్ర ‘మనబడి’ ఐదవ సాంస్కృతికోత్సవం స్థానిక సన్నివేల్ హిందూ దేవాలయ ఆవరణలో ఘనంగా ఫిబ్రవరి 4,5 తేదీలలో జరిగింది. 2007లొ ప్రారంభమైన మనబడి కార్యక్రమము, ఐదు సంవత్సరాలు పూర్తిచేసుకుని, అమెరికాలో పదిహేను పైగా రాష్ట్రాలలో విస్తరించి, 1700ల మంది బాల బాలికలను తెలుగు భాషలో సుశిక్షితులను చేస్తున్నది. తెలుగు నేర్చుకున్న పిల్లలు భాషలో తమ ప్రావీణ్యాన్ని సాంస్కృతికోత్సవంలో లఘునాటికలు, పాటలు, పద్యాలు, దేశభక్తి గేయాల ద్వారా ప్రదర్శించి ప్రేక్షకులను అలరించారు. సాంప్రదాయ పద్ధతిలో వేద ప్రవచనంతోను, పిల్లలకు, వారికి తెలుగు భాష నేర్పించి...
లండన్, జనవరి 11 (ప్రత్యేక ప్రతినిధి) తెలుగు సంస్కృతి సంప్రదాయాలు బ్రిటన్ దేశమంతటా పరిచయం చెయ్యాలనే సత్సంకల్పంతో యునైటెడ్ కింగ్డం తెలుగు సంఘం (యుక్తా) ప్రతి సంవత్సరం లాగే ఈ ఏడాది కూడా లండన్ పార్లమెంట్ భవనంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించింది. బుధవారం పోర్ట్ కలిస్ హౌస్ లో జరిగిన ఈ వేడుకలకు లార్డ్ లూంబ, లార్డ్ ధోలాకియా, ఈలింగ్ సౌతాల్ పార్లమెంట్ సభ్యుడు వీరేంద్ర శర్మ,...